హన్మకొండలోని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, సహచరులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో అష్టశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు.