విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో టెంట్ హౌస్ లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ లో మహేశ్ అనే వ్యక్తి టెంట్ హౌస్ నిర్వహిస్తున్నాడు. టెంట్ హౌస్ సామగ్రి నిల్వచేసిన గదిలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో రూ. లక్షల విలువ చేసే సామగ్రి కాలిపోయిందని బాధితుడు తెలిపారు.