ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ విభాగాల మండల స్థాయి సమావేశం గురువారం మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడపాక శ్యాం మాదిగ అధ్యక్షత జరిగింది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.