ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను శుక్రవారం మంత్రి సీతక్క ప్రారంభించారు. చల్వాయి గ్రామంలో ఎస్ హెచ్ జి మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.