ములుగు జిల్లా ఏటూరునాగారంలోని వై జంక్షన్ వద్ద 35 ఫీట్ల ఎత్తుతో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తెలిపారు. 163 జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల నివారణకు, గ్రామం సుభిక్షంగా ఉండేందుకు వై జంక్షన్ లో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామన్నారు. ఈనెల 14న భూమిపూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు.