మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు భారతదేశ మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రతిజ్ఞ చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ చంద్రమౌళి, ఆర్ఐ అనిల్, ఆర్ఎస్ఐ పుల్లారావు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.