మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం గార్ల మండలం లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో శుక్రవారం పెద్దకిష్టాపురంలోని ఓ ఇంట్లో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. డాక్టర్ వెంకట్ లాల్ ఇంట్లో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో పొగ కమ్ముకోవడంతో గ్రామస్థులు గమనించి తలుపులు తొలగించి మంటలను ఆర్పారు.