భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శనివారం కార్తీక మాసం ఘనంగా ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 1 వరకు నెల రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఆలయ ఆవరణాలు భక్తుల రద్దితో శివనామస్మరణ మారుమోగనున్నాయి. వేకువ జామున నుండే సుదూర ప్రాంతాలతో పాటు మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు