భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరాలయంలో సోమవారం ఆలయ అధికారులు హుండీ లెక్కించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలలో 3 నెలల 25 రోజుల వ్యవధిలో భక్తులు కానుకల రూపంలో హుండీలలో వేసిన నగదును ఆలయాధికారులు హుండీలు విప్పి లెక్కించగా రూ. 22, 27, 805 నగదు సమకూరినట్లు ఆలయ ఇఓ మారుతి తెలిపారు.