భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయంలో శనివారం భక్తులు శనిపూజలకు బారులు తీరారు. వేకువజాము నుండి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం కావడంతో నవగ్రహల వద్ద శని పూజలు నిర్వహించుట కోసం భక్తులు బారులు తీరారు. శనీశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో నల్లబట్ట, నూలు, తైలం సమర్పించి శనీపీడిత బాధలు తొలిగిపోవాలని వేడుకున్నారు.