భూపాలపల్లి జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు దిలీప్ కుమార్, నాగభూషణం, విశ్వతేజ, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్ వరి పొలాలను, ప్రత్తి చేనులను, మిర్చి తోటలను మంగళవారం సందర్శించారు. ప్రత్తిలో రసం పీల్చు పురుగుల అధికంగా ఉన్నట్లు గుర్తించి వాటి నివారణకు డాఫెంతయిరాన్ అనే మందును 1. 25 గ్రాములు లేదా అసిఫేట్ 1. 5 గ్రాములు లీటర్ నీరు చొప్పున కలిపి పిచికారి చేసుకుకోవాలని సూచించారు.