తాండూరు పట్టణంలోని బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి చొరవ చూపుతామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ విజ్ఞప్తి మేరకు గురువారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పోలీస్టేషన్ వెనుకాల ఉన్న బీసీ స్మశాన వాటికను సందర్శించారు. రాజ్ కుమార్ పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి చొరవ చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.