గృహ జ్యోతి పథకం వర్తించని గ్రామ పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయంలో మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్ శాఖ తాండూర్ డీఈ భాను ప్రసాద్, కొడంగల్ ఏడిఈ నవీన్ కుమార్ తెలిపారు. గత ప్రజాపాలనలో చేసుకున్న రశీదు, ఆధార్, రేషన్, కరెంట్ బిల్, గ్యాస్ బుక్ జిరాక్స్, ఫోన్ నంబర్‌తో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.