వికారాబాద్: ఎలాంటి భరోసా ఇస్తారో సీఎం చెప్పాలి: డీకే అరుణ
ఫార్మా ఇండస్ట్రీని ఎవరు అడ్డుకోవట్లేదని, రైతుల దగ్గరికి వెళ్లి ఇండస్ట్రీ గురించి వివరించాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం వికారాబాద్ కలెక్టర్ ను కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు భూములు పోతే ఎలాంటి భరోసా ఇస్తారో సీఎం వివరించాల్సిన అవసరం ఉందని, వారిలో ఉన్న అనుమానాలు, అపోహలు తొలగించాలని, అధికారం ఉంది కదా అని రాజకీయం చేయడం సరికాదు అని అన్నారు.