వికారాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కార్తీక సోమవారం కావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తులు కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. ఉదయం నుంచే దర్శనాలకు భక్తులు బారులు తీరడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.