గండీడ్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి గురువారం అన్నారు. గండీడ్ మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి, జక్కులపల్లి, జిన్నారం, జిన్నారం తండా, పగిడియాల పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఎపీఎం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.