మెడికల్ హబ్ గా కొడంగల్ మారనుంది. అందులో భాగంగానే వైద్య, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలు మంజూరు అయ్యాయి. ఇప్పటికే భవనాల నిర్మాణానికి స్థల సేకరణ, టెండర్లు పూర్తయ్యాయి. అయితే నర్సింగ్ కాలేజీకి అడ్మిషన్లు జరగడంతో కలెక్టర్ ఆదేశాలతో కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు శనివారం మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు.