అధైర్య పడొద్దని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని గురువారం పరిగి పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.