తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, జిల్లాలో గ్రూప్ -3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణపై అడిషనల్ ఎస్పి రవీందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ సుధీర్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.