ఇవాళ స్వామి వివేకానంద వర్ధంతి

81பார்த்தது
ఇవాళ స్వామి వివేకానంద వర్ధంతి
కేవలం ముప్ఫై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికీ భారతదేశ ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారు. యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచిన స్వామి వివేకానంద వర్ధంతి ఇవాళ.