ఖర్బూజా పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఖర్బూజా పండులో బీటా కెరాటిన్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. కంటి సమస్యలను దూరం చేస్తాయి. ఈ పండు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. మెదడుకి ఆక్సిజన్ సరఫరా పెరిగి ఒత్తిడి తగ్గుతుంది.