స్మార్ట్‌ ఫోన్‌ వ్యసనాన్ని తగ్గించే సరికొత్త ఫోన్‌

60பார்த்தது
స్మార్ట్‌ ఫోన్‌ వ్యసనాన్ని తగ్గించే సరికొత్త ఫోన్‌
ప్రస్తుత కాలంలో మానవులు తిండిలేకున్నా ఉంటారేమో కానీ.. స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేరు. ఈ క్రమంలో స్మార్ట్‌‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించేందుకు HMD అనే యూరోపియన్‌ ఫోన్‌ల తయారీ కంపెనీ సరికొత్త ఫోన్‌ను తయారుచేసింది. స్మార్ట్ ఫోన్‌లో ఉండే ఫీచర్లు ఈ ఫోన్‌లో ఏమీ ఉండవు. ఒకరకంగా చెప్పాలంటే తొలుత కనీస ఫీచర్లతో ఫోన్‌లు ఎలా ఉండేవో ఈ ఫోన్‌ కూడా అలానే ఉంటుంది. ప్రస్తుతం దాదాపు రూ.11 వేల ధరకు ఈ ఫోన్‌ యూకే, యూరోప్‌లో అందుబాటులోకి వచ్చింది.