తెలంగాణలో పలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు మరువకముందే.. మరో ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి (D) నారాయణ ఖేడ్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకులానికి చెందిన 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. స్వల్పంగా అస్వస్థతకు గురైన వారికి సిబ్బంది మందులను అందజేశారు.