ఛాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు వచ్చే విదేశీయులే లక్ష్యంగా ఉగ్ర సంస్థ కుట్ర చేసినట్లు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. విదేశీయులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ప్రయత్నిస్తోందని తెలిపాయి. ఆ ఉగ్రసంస్థ పోర్టులు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలపై నిఘా వేసిందని వెల్లడించాయి. ప్రత్యేకంగా చైనా, అరబ్ దేశీయులను టార్గెట్‌గా చేసుకుందని పాక్ ఇంటెలిజెన్స్ పేర్కొంది.