తెలంగాణలో టెన్త్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ఉ. 9.30 గంటల నుంచి మ. 12.30 గంటల వరకు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపొజిట్ కోర్సు సబ్జెక్టు పరీక్ష ఉ. 9.30 నుంచి మ. 12.50 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షలకు 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు హాజరవుతుండగా.. 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.