సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకల్లో 9వ రోజు చివరి రోజు అయిన ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించనున్నారు. పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, బంతిపూలు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మ అందంగా పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. అనంతరం రాత్రివేళలో ఆటపాటలతో అమ్మవారిని కొలచి, బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.