హుజూర్నగర్ పట్టణంలో జబర్దస్త్ నటులు వినోద్, మోహన్, శాంతి స్వరూప్ లు సందడి చేశారు. స్థానిక 17వ వార్డులో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలూరి రాంబాబు, బెల్లంకొండ అమర్ గౌడ్, బెల్లంకొండ శోభ, బత్తిని ధనలక్ష్మి, వెంకట్ రావమ్మ, చింటూ, వినోద్, స్వాతి మారెమ్మ, భవాని, సంధ్య, పద్మ, కవిత, అనసూయ, శాంత, తదితరులు పాల్గొన్నారు.