తమిళ స్టార్ హీరో సూర్య 'కంగువ' ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జ్యోతిక తన గురువు అని అన్నారు. జ్యోతిక తన కోసం కుటుంబం, కెరీర్ ఇలా చాలా త్యాగాలు చేసిందని అన్నారు. అందుకే తన ఫ్యామిలీతో ఉండేందుకు, తనకు నచ్చిన విధంగా జీవించేందుకు ముంబైకి షిఫ్ట్ అయ్యామని తెలిపారు. విడాకులపై వచ్చిన పుకార్లకు సూర్య ఇలా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సూర్య నటించిన కంగువ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది.