యూపీలోని నోయిడాలో శుక్రవారం ఊహించని ఘటన జరిగింది. అమిటీ యూనివర్శిటీలోని ఎయిర్ కండిషనింగ్ (AC) ద్వారా క్లాస్‌రూమ్‌లోకి ఓ పాము ప్రవేశించింది. దీంతో విద్యార్థులు భయంతో కేకలు వేస్తూ క్లాస్ రూమ్ నుంచి పారిపోయారు. వెంటనే యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది స్పందించారు. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.