గంభీరావుపేట మండలం ముస్తాఫా నగర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కొమీరిశెట్టి విజయ బుధవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొక్కు రాజాం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గౌరినేని ప్రసాదరావు, కృష్ణ కాంత్, వ్యవసాయ సహకార సంఘం సిఓ రాజిరెడ్డి, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.