పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ. 25 లక్షల 94 వేల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను 91 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.