ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ సమర్పించిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. వీటిలో రెవిన్యూ 16, ఇతర దరఖాస్తులు 19 మొత్తం 35 స్వీకరించామన్నారు.