పెద్దపెల్లి జిల్లా వామపక్ష పార్టీల సమావేశం పెద్దపల్లి లోని అమరవీరుల స్థూపం ఆవరణలో జరిగింది. ఇందులో సిపిఎం జిల్లా కార్యదర్శి యాకయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ సదానందం. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే, రాజయ్య మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక దేశ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలకు కారుచౌకగా, వ్యవసాయాన్ని కార్పొరేట్ల అప్పజెప్పడానికి మూడు చట్టాలు తెచ్చిందని, విద్యుత్ రంగ మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి విద్యుత్ సవరణ చట్టం తెచ్చిందని, కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ తెచ్చిందని, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతుందని, యువతకు ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలం అయిందని, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ ప్రశ్నించిన వారిపై దేశద్రోహ కేసు పెడితే హింసిస్తున్న ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే అనేక తిరోగమన విధానాలను బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందని, ఈ విధానాలను ప్రతిఘటించడానికి, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను పక్కకు పెట్టి, ఈ రాష్ట్ర ప్రజానీకం సమస్యలను పరిష్కరించకుండా పోడు భూముల రైతులకు గిరిజనులకు భూములు దక్కకుండా చేస్తూ గిరిజన రైతుల పై అక్రమ కేసులు బనాయిస్తూ చిత్రహింసలకు గురిచేస్తుందని, నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యం అప్రజాస్వామిక పాలన టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తోంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 22న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లాలోని ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.