వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంధాలయం పెద్దపల్లిలో లైబ్రేరియన్ యూనుస్ ఖాద్రి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం అని వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది స్వరూప, ప్రేమ్ చంద్, పాఠకులు షేక్ సాజిద్, మొహమ్మద్ కలీం, రాజ్ కుమార్, నిఖిల్ షాపూర్, మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.