కమాన్ పూర్: మహిళల భద్రత కోసమే షీ టీం

74பார்த்தது
కమాన్ పూర్: మహిళల భద్రత కోసమే షీ టీం
మహిళల భద్రత కోసమే షీ టీంలు పని చేస్తున్నాయని షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. సోమవారం షీ టీం ఇన్ ఛార్జ్ మల్లన్న ఆధ్వర్యంలో కమాన్ పూర్ మండలం రొంపికుంటలోని జెడ్పీ హై స్కూల్ లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీటీం సభ్యుడు సురేష్, హెడ్ మాస్టర్ నిర్మల జ్యోతి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி