ఇల్లంతకుంట: ప్రజా అభివృద్ధిపై దృష్టి సారించండి: హరీష్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా మండలంలో అభివృద్ధి పనులకు మోక్షం లేదని దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ విమర్శించారు. ఆదివారం ఇల్లంతకుంట కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పనులు, 50 పడకల ఆసుపత్రి నిర్మాణం హామీలను గాలికి వదిలివేసి విగ్రహ శంకుస్థాపనలు, ప్రారంభాలపై ఆసక్తి చూపించడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గారడీ చేస్తుందన్నారు.