జగిత్యాల: ఎంసీహెచ్‌లో తారుమారైన నవజాత శిశువు
జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నవజాత శిశువు తారుమారైన సంఘటన సోమవారం జరిగింది. నాలుగు రోజుల క్రితం ప్రసన్న అనే గర్బవతికి డెలివరీ చేసి సోమవారం వైద్య బృందం డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లే క్రమంలో శిశువు మారిందని వైద్య సిబ్బంది ఫోన్ చేశారు. పెరెంట్స్ తిరిగి శిశువును అప్పగించి తమ శిశువును తీసుకువెళ్లారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే శిశవులు తారుమారయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.