పారిశుద్ధ్య సమస్యలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మూడు అజెండా అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.