కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థల కోసం పనిచేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్లయ్య అన్నారు. గజ్వేల్ లోని పార్టీ కార్యాలయంలో మహాసభ సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ చట్టాల ద్వారా కార్మికులకు వెన్నుపోటు పొడిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.