జగదేవ్ పూర్ గ్రామ పంచాయతీల నిర్వహణకు ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పంచాయతీ కార్యదర్శులను ఆదుకోవాలని టి. ఎన్. జి. ఓ. పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ శనివారం డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను సర్వీస్ కౌంట్ చేస్తూ రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ కాని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వాలన్నారు.