రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ కు గజ్వేల్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బి. ప్రియాంక పదివేలు జరిమానా విధించారని ఎస్ఐ విజయ్ కుమార్ వివరాల ప్రకారం 2016లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్పుల కుమారస్వామిపై అప్పటి ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం న్యాయవాది జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని తెలిపారు.