సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని గ్రామ ఉప సర్పంచి బొల్లం స్వామి శనివారం తనిఖీ చేశారు. విద్యార్థులకు, గర్భిణీలకు అందిస్తున్న ఆహారపదార్థాలను పరిశీలించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఆయన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు పలువురు పాల్గొన్నారు.