US యువతి లెక్సీ ఆల్ఫోర్డ్ 21 ఏళ్ల వయసుకే 195 దేశాలు చుట్టేసి గిన్నిస్ రికార్డుకెక్కారు. తాజాగా ఆమె 26 ఏళ్లలో విద్యుత్ కారులో ప్రపంచమంతా తిరిగిన తొలి వ్యక్తిగా మరో రికార్డును సృష్టించారు. కారులో 200 రోజుల పాటు 6 ఖండాల్లో 30,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. తన తల్లిదండ్రులు ట్రావెల్ ఏజెంట్లుగా చేసేవారని, వారి స్ఫూర్తితోనే ఈ ప్రయాణాన్ని పూర్తి చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.