TG: రాష్ట్రవ్యాప్తంగా 3 వారాలుగా ‘మీసేవ’ సర్వర్లలో సాంకేతిక సమస్యలతో పౌర సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ధ్రువపత్రాల డౌన్‌లోడ్.. పౌర సేవలు వంటి వాటికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 2న తలెత్తిన సర్వర్ సమస్యలకు ఇప్పటికీ సరైన పరిష్కారం లభించలేదు. సర్వర్ ఎప్పుడు పనిచేస్తుందో.. ఎప్పుడు డౌన్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5,216 మీసేవా కేంద్రాల చుట్టూ నిత్యం వేల మంది తిరుగుతున్నారు.