ప్రముఖ అస్సామీ సీనియర్ నటుడు, దర్శకుడు కులద కుమార్ భట్టాచార్య (91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి గౌహతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఎనలేని సేవలు అందించిన ఆయనకు సీఎం హిమంత బిస్వా శర్మ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంతాపం తెలిపారు.