సంగారెడ్డి లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ క్రియాశీల సభ్యత్వ సేకరణను మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త 100 సభ్యత్వాలు పూర్తి చేసి క్రియాశీల సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో సభ్యత్వ సేకరణ ఇన్చార్జి లక్ష్మీ నరసయ్య, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నాయకులు పాల్గొన్నారు.