మతిస్థిమితం సరిగా లేదని గుర్తించిన పోలీసులు

77பார்த்தது
అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి కాలనీ ప్లాట్ నంబర్ 37లో ఓ వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. స్థానికులు అరవగా పారిపోయేందుకు చూడగా అతడిని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అమీన్పూర్ పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా తన పేరు ప్రమోద్ కుమార్ అని పిచ్చిపిచ్చిగా మాట్లాడడంతో, మతిస్థిమితం సరిగ్గా లేదని గుర్తించారు.