సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిన్నారం మండల శక్తి కేంద్ర ఇన్‌ఛార్జులతో మండల అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లంరాజు రెడ్డి హాజరయ్యారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి బూతులో 200 సభ్యత్వం పూర్తి చేసేలా కృషి చేయాలని అన్నారు.