ఈనెల 12వ తేదీ నుంచి వికారాబాద్ జిల్లా ధారూరులో ప్రారంభమైన ఉత్సవాలు తెల్సిందే. విశాలమైన ప్రదేశం కాగ్నా నది పక్కన స్టేషన్ ధారూరు-దోర్నాల్ గ్రామాల మధ్య ఉత్సవాలు కొనసాగుతాయి. 96 సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులతో ఉత్సవాలను నిర్వహించడం ప్రత్యేకం. ఈ సంవత్సరం కూడా దాదాపు 10 లక్షల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు శుక్రవారం అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.