సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండల కేంద్రంలో బుధవారం నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తదితరులు పాల్గొన్నారు.